Suresh Naik
Name: Suresh
Naik Ramavath
Father’s Name: Harilal (Late) – (Tahasildar - Ibrahimpatnam)
Qualification:
•MBA – Indian Institute of Management (IIM)
Calcutta
•M Phil in Management, pursuing (PhD)
•B.E – CBIT, Hyderabad
•School Education from Hyderabad Public School (HPS)
•M Phil in Management, pursuing (PhD)
•B.E – CBIT, Hyderabad
•School Education from Hyderabad Public School (HPS)
Occupation: Entrepreneur -Telecom & IT Business
& Educationalist
Caste/ Community: Schedule Tribe
(ST) – Lambada
Constituency: Devarakonda
– 86
Email/ Mobile: sureshnaikysrcp@gmail.com / 88860 06666, 98480
66661,
Languages known: Lambada,
Telugu, Hindi & English
Current positions:
•President & Managing Director: International School of Telecom & Technology Management (ISTTM Business School Pvt Ltd)
•Managing Director: International Institute of Business Development Managers (IIBDM Online Business School)
•Executive Director: Society of Technology Leaders (SOTL Knowledge Service Pvt Lmt)
•President: Harileela Educational Society
•President: Help Tribals Society
•Managing Director: Hitec Beverages
•Member: Board of Advisory committee, Engineering Staff College of India (ESCI)
•Member: Board of Advisory committee, Institute of Engineers India
•Member: Hyderabad Director/CEO Forum
•Member: TIE ( The Indus Entrepreneurs)
•Member: Hyderabad Management Association (HMA)
•Member: CII Young Indians
Previous positions held:
•Member: Board of Advisory committee, Engineering Staff College of India (ESCI)
•Member: Board of Advisory committee, Institute of Engineers India
•Member: Hyderabad Director/CEO Forum
•Member: TIE ( The Indus Entrepreneurs)
•Member: Hyderabad Management Association (HMA)
•Member: CII Young Indians
Previous positions held:
•President : Telecom Engineering Services Vendors Association of India (TESVAI)
•Senior Vice President: Servomax India Limited
•General Manager: Prithvi Information Solutions Limited
•Global Leadership Cadre (GLC): Tech Mahindra (Middle East & Africa)
•Account Manager for Microsoft and Google
Awards and Accolades:
•All India Achievers Award winner 2011 for Arch of Excellence in Management Education at All India Achievers Conference at New Delhi.
•Social Service award - 2011 from V Care foundation for service to the orphan children
•Glitz award - 2011 for the fund raising cultural activity for HIV+ children of Desire society
Motive to associate with the party
I always had a desire to work for the society primarily in the areas of education, employment and
development of living standards of the people.
One of the key reasons why I left my high profile job in Dubai and returned to Hyderabad is to fulfil
my desire to contribute my services to the community and the State which is my origin and identity.
I was connected to the ideologies of YSR Congress party and the leader Shri Jagan Mohan Reddy.
His commitment made to the people after the demise of the great leader YSR and the struggle he
has gone through to fulfil the same has inspired me to follow him. His fighting spirit and courage to
face the tough situations comprehensively has given me confidence that he will be “the leader of
the future” for our state. I decided to be part of his journey and pursue his vision and service the
people of the state.
I understood that YSR Congress party encourages the young, qualified professionals to step into
politics and service the people. My desire is to carry out genuine service to the community and the
people. I strongly believe that under the guidance of the leader, senior members of the party, family,
friends and my corporate colleagues, I would certainly transform my desire to reality. I appeal to
the party representatives to acknowledge my candidature and provide me a platform to deliver my
services effectively to the people of the State.
మా
తాత గారి పేరు గేమ్యానాయక్, ఆయన ఆ రోజుల్లో దేవరకొండ
పరిసర ప్రాంతాల్లో మంచి పేరున్న నాయకుడు. ఆయన తన సొంత ఖర్చుతో దేవరకొండలో పేద
విద్యార్ధులకు హాస్టళ్లు నిర్మించి వారికి చదువులు చెప్పించారు. ఆ విద్యనే ఈ రోజు
ఎంతో మందిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దింది. మా నాన్నగారి పేరు హరిలాల్ నాయక్
ఆయన పుట్టి పెరిగింది దేవరకొండలో, ఆయన చాలా మంది పేదవారికి
జీవన ఉపాధి కల్పించారు. అమ్మగారి పేరు లీలావతి. నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు మా
నాన్నగారు చనిపోయారు. నాన్నగారి దయా గుణంతో ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి
వచ్చింది. మమ్మల్ని ప్రయోజకులుగా
తీర్చిదిద్దడమే జీవితంగా ఈనాటికి మాకు తోడుగా ఉన్న మా అమ్మ సహకారంతో, ఇంటికి పెద్ద
కొడుకుగా బాధ్యతల్ని నిర్వర్తిస్తూ చదువుకున్నాను. మన దేశంలో చాలా
తక్కువమంది చదువుకునే అరుదైన చదువు ఐ.ఐ.ఎం లో పూర్తి
చేసి, విదేశాలకు
వెళ్ళి వచ్చి, అంతర్జాతీయ పరిశ్రమలను మరియు
విద్యాసంస్థలను మన రాష్ట్రంలో స్థాపించి విజయవంతంగా నడుపుతున్నాను.
నా చిన్నతనం నుండి
దేవరకొండ నియోజకవర్గ ప్రజల ఇబ్బందులు చూస్తున్నాను. ప్రజలు అప్పుడు ఎలా
ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు అవే ఇబ్బందులకు గురి అవుతున్నారు. అభివృద్ధి శూన్యం. కష్టాలలో పెరిగి కష్టాలకు అలవాటు పడిపోయారు. దీనికి
కారణం ఇక్కడి ప్రజాప్రతినిధులే... అక్రమ రాజకీయ సంపాదనే బ్రతుకు తెరువుగా
మార్చుకున్న ఇక్కడి రాజకీయ నాయకులు ప్రతి ఒక్క ప్రజా సంక్షేమ కార్యక్రమానికి కేటాయించిన ప్రజల సొమ్మును తమ స్వంత
ప్రయోజనాలకు వాడుకుంటూ దారుణమైన అవినీతికి పాల్పడుతున్నారు. నియోజకవర్గంలోని చాలా
గ్రామాలకు త్రాగడానికి మంచి నీళ్ళు లేవు, రవాణా సౌకర్యాలకు మంచి
రోడ్లు లేవు, పిల్లలు చదువుకోడానికి మంచి స్కూల్స్ లేవు, యువకులకు మంచి కాలేజీలు లేవు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి చిన్న పరిశ్రమలు లేవు, మంచి వైద్య సదుపాయాలు లేవు, అసలు నియోజకవర్గ
అభివృద్ధికి కావలసిన కనీస సౌకర్యాలు ఏవి లేవు. దీన స్థితిలో ఉన్న మన ప్రాంతాన్ని
చూసి చలించి పోయాను. ఎన్నో పరిశ్రమలను అభివృద్ధి చేసిన అనుభవం ఉన్న నేను, నేను పుట్టిన దేవరకొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన సమయం ఆసన్నమైనదని, ఇక్కడ రాజకీయ పరిస్థితులను మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావించి దృఢసంకల్పంతో రాజకీయాల్లోకి
వచ్చాను.
దేవరకొండ నియోజకవర్గానికి 2012-13 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ నుంచి రావలిసిన
నిధులు
Ø
ఎస్.టి. సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్ మరియు సబ్ ప్లాన్ ద్వారా
రావలసిన నిధులు 102 కోట్ల రూపాయలు
Ø
ఎస్.సి సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్ మరియు సబ్ ప్లాన్
ద్వారా రావలసిన నిధులు 42కోట్ల రూపాయలు
Ø
బి.సి అభివృద్ధికి రావలసిన నిధులు 6.6కోట్ల రూపాయలు
Ø
మైనారిటి అభివృద్ధికి రావలసిన నిధులు 8.5కోట్ల రూపాయలు
Ø
వ్యవసాయానికి బోర్ వెల్స్ రావలసిన నిధులు 8.5కోట్ల
రూపాయలు
Ø
మంచి నీరు మరియు పారిశుధ్యానికి 5 కోట్ల రూపాయలు
Ø
స్త్రీ సంక్షేమాభివృద్ధి రావలసిన నిధులు 18.5కోట్ల
రూపాయలు
Ø
రాజీవ్ యువ కిరణాలు (యువకుల ఉద్యోగాల కోసం ) రావలసిన నిధులు
2.8కోట్ల రూపాయలు
Ø
గృహనిర్మాణాలు రావలసిన నిధులు 8.2కోట్ల రూపాయలు
Ø
ఆరోగ్య శాఖ రావలసిన నిధులు 20కోట్ల రూపాయలు
Ø
గ్రామీణాభివృద్ధి రావలసిన నిధులు 22.8కోట్ల రూపాయలు
Ø
ప్రాధమిక విద్య రంగానికి రావలసిన నిధులు 54కోట్ల రూపాయలు
Ø
రోడ్లు మరియు రవాణా రావలసిన నిధులు 18కోట్ల రూపాయలు
Ø
చిన్న నీటి పారుదల శాఖ రావలసిన నిధులు 10కోట్ల రూపాయలు
Ø
ఉపాధి మరియు రోజువారీ కులీ రావలసిన నిధులు 4కోట్ల రూపాయలు
Ø
పారిశ్రామికాభివృద్ధి రావలసిన నిధులు 6కోట్ల రూపాయలు
Ø
వికలాంగుల కోసం రావలసిన నిధులు 0.2కోట్ల రూపాయలు
Ø
క్రీడాభివృద్ధి కోసం రావలసిన నిధులు 0.8కోట్ల రూపాయలు
కేవలం ఈ ఒక్క
సంవత్సరంలోనే మన దేవరకొండ నియోజకవర్గానికి రాష్ట్ర బడ్జెట్ నుంచి 340 కోట్ల రూపాయల
పైన రావాలి.
ఇన్ని కోట్ల
రూపాయల నిధులను మన ప్రజా ప్రతినిధులకు తెచ్చే సత్తా లేదా! లేక తెచ్చి దుర్వినియోగం చేస్తున్నారా!
ఎస్.టి, ఎస్.సి, బి.సి, మైనారిటీ ఇలా
ఏ సామాజికవర్గాలని, ఏ సంక్షేమ పతకాలని తీసుకున్నా, ఎవరు అభివృద్ధి చెందటం లేదు మరి వారి శాఖకు కేటాయించిన కోట్ల రూపాయల
నిధులు ఏమయినట్లు?
అని వీరిని ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైనది.
వివిధ
దేశాలలో మరియు రాష్ట్రాలలో ఆయా ప్రదేశాల ప్రజల జీవన విధానం,
అవినీతి రహిత రాజకీయ వ్యవస్థలను చూసిన నేను మన దేవరకొండ ప్రజల దుర్బరమైన జీవితాలు, రాజకీయాల్ని శాసిస్తున్న అవినీతిని చూసి చలించి పోయాను. మూడు లక్షల మంది
ఉద్యోగులు పనిచేసే సంస్థకు సి.ఈ.ఓ స్థాయి నా చదువును, మూడు
లక్షల మంది జనాభా ఉండే దేవరకొండ నియోజకవర్గ ప్రజల అవసరాలు తీర్చడానికి, వారి జీవితాల్లో మార్పు తీసుకొని రావడానికి ఉపయోగ పడుతుందని, ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన సంస్థలను లాభసాటిగా నడిపించిన నా అనుభవం మరియు
నాయకత్వ విలువలు కలిగిన వ్యక్తిత్వం మన నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడుతుందని భావించి, ప్రజా సేవ చేయడానికి మీ ముందుకు వచ్చాను. దేవరకొండ నియోజకవర్గంలోని ప్రతి
పల్లె తిరుగుతూ, ఇక్కడ ప్రజల అవసరాలు తెలుసుకుంటూ, నాకు చేతనైన సాయం చేస్తూ, మీ అభిమానాన్ని
పొందుతున్నాను.
మన రాష్ట్రం 1,60,000
కోట్ల రూపాయల అప్పులో ఉంది. వడ్డీ మాత్రమే సంవత్సరానికి 2000 కోట్లకు పైగా కడుతున్నాము. ఒకొక్క మనిషి
మీద 20,000 రూపాయల అప్పు ఉంది, అంటే సుమారు ఒక్క కుటంబానికి లక్ష రూపాయల అప్పు. మన రాష్ట్రంలో పుట్టే
పిల్లవాడికి మొట్టమొదట మనం ఇచ్చే ఆస్తి 20000 రూపాయల అప్పు. మన సొమ్మును అలా ఇష్టం
వచ్చినట్లు ప్రజా ప్రతినిధులు దోచుకుంటూ ఉంటే ఎలా చూసి వూరు కుందాం!
ఒక నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే
అక్కడ ఎం.ఎల్.ఏకి కచ్చితంగా మంచి చదువు, సామర్ధ్యం, ప్రస్తుత ప్రపంచం పైన అవగాహన, సాంకేతికరంగంలో
వస్తున్న మార్పులను వినియోగించుకునే శక్తి, వివిధ రాష్ట్రాల్లో,
దేశాల్లోని ప్రభుత్వ పరిపాలన విధానం పై అవగాహన, ప్రజల సమస్యల
కోసం పోరాడే తత్వం, సేవ చేయాలన్న తపన,
ప్రజల అభివృద్ధి పట్ల నిబద్ధత ఉండాలి.
- ప్రజల మౌళిక అవసరాలైన త్రాగటానికి మంచి నీరు, ఉండటానికి ఇళ్లు, పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన విద్య మరియు వైద్య సదుపాయాలు కల్పించాలి.
- రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర, ఎలాంటి నష్టం లేకుండా పంటకు ఇన్సూరెన్స్, పెట్టుబడికి
- కావల్సిన రుణాలు మరియు ప్రభుత్వం నుండి సబ్సిడీ సౌకర్యాలు కల్పించాలి.
- రవాణా సౌకర్యాలు పెంచటం కోసం మంచి రోడ్లు వేయించాలి.
- స్త్రీలకు స్వయం ఉపాధి కల్పించాలి.
- కొత్త పరిశ్రమలు వచ్చేలా కృషి చేయాలి ఎక్కడ పరిశ్రమలు ఎక్కువగా వస్తాయో అక్కడ యువకులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి మరియు ఆర్దిక స్తోమత మెరుగుపడ్తుంది.
- మన నియోజకవర్గం ఉన్నత స్థాయికి రావాలంటే ఇక్కడ అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, రీటైల్, ఎఫ్.ఎం.సి.జి, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, ఐ.టి, కమ్యూనికేషన్, టూరిజం, హాస్పిటాలిటీ, మీడియా, రియల్ ఎస్టేట్, ఇలా అన్నీ రంగాలు అభివృద్ధి చెందాలి.
ఇవన్నీ
నేను ఇక్కడ చేయాలనే ఖచ్చితమైన ప్రణాళికలతో
ఉన్నాను. చేసి చూపిస్తాను. అవినీతి రహిత సమాజాన్ని నిర్మించుకుంటూ ప్రజాసేవలో
జీవిస్తాను.
రాష్ట్రంలో
మరియు కేంద్రంలో తమ ప్రభుత్వం పాలనలో ఉండికూడా ఏమీ చేయలేని నాయకులు, ఏ పార్టీలో ఉంటే మాత్రం ఏం లాభం? పాతిక వేలు కూడా
లేకుండా పదవిలోకి రాగానే పాతిక లక్షల ఏ.సి కార్లలో హాయిగా తిరుగుతున్నారు మన ప్రజా
ప్రతినిధులు... కానీ వారిని గెలిపించడానికి ఎండలో క్యూలో నిలబడి మరీ ఓట్లు వేసిన
జనాలను మాత్రం పూర్తిగా మరచిపోవటం దారుణం కాదా!
ఆలోచించండి!..
ఒక
నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న
కొన్ని వందల కోట్ల నిధులు మన
ప్రజాప్రతినిధుల చేతిలో ఉంటాయి... ఆ నిధులని తీసుకురాగలిగే సత్తా మరియు వాటిని
సక్రమంగా ఉపయోగించే సామర్థ్యం ఉండాలి.
మీ
భవిష్యత్... మీ బిడ్డల భవిష్యత్ ఒక నాయకుడి చేతిలో పెడుతున్నప్పుడు ఒక్క సారి
ఆలోచించి ఎన్నుకోండి!...
మీ సేవలో...
రామవత్
సురేష్ నాయక్
వైఎస్‌ఆర్
కాంగ్రెస్ పార్టీ
Suresh is not that fair as he claims to be. He runs a management college ISTTM in Hyderabad, there are many complaints on his college, one can see them on internet, then judge yourself about him.
ReplyDelete